Friday, November 22, 2024

Keerthy Suresh: చిన్న‌కొంగులో అందాల విందు

మహానటి కీర్తి సురేష్ త్వరలో తన కోలీవుడ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. నయా లుక్స్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ గా మారింది. దక్షిణాదిలో తనకటూ మంచి క్రేజ్ దక్కించుకున్న కీర్తి సురేష్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఆకట్టుకుంటోంది.

- Advertisement -

తాజాగా కోలీవుడ్ చిత్రం ‘సైరెన్స‌ తో అలరించబోతోంది. ఈ చిత్రం ఆడియో లాంచ్ రీసెంట్ గా జరిగింది. జయం రవి , కీర్తి జంటగా నటించిన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పటికే సినిమా ప్రమోషనల్ మెటీరియల్ అంచనాలను పెంచాయి. సినిమా రిలీజ్ అయిన సందర్భంగా సోషల్ మీడియాలో ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కీర్తి తన బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. అందమైన ఫొటోలను పంచుకొని కట్టిపడేసింది.

ఆడియో లాంఛ్ కు హాజరైన కీర్తి సురేష్ చీరకట్టు అందరినీ ఆకట్టుకుంటోంది. కొంగు చిన్నగా ఉన్న చీరకట్టి ఫొటోలకు కిర్రాక్ గా ఫోజులిచ్చింది. మరోవైపు స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శిస్తూ ఫ్యాన్స్ ను చూపుతిప్పుకోకుండా చేసింది. జబ్బల జాకెట్ లో స్టార్ హీరోయిన్ మెరుపులు మెరిపించింది. తన అందంతో ఆకర్షించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement