స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్.. గత ఏడాది మూడు బ్లాక్ బస్టర్లు అందుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీర సింహా రెడ్డి, ప్రభాస్ సలార్ తో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం డైనమిక్ హీరో అడవి శేష్ తో డెకాయిట్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని చిత్రాలు కూడా చేస్తోంది శ్రుతి. ఇటీవల ఈ అమ్మడు హాలీవుడ్ ఆఫర్ అందుకుంది.
బాఫ్తా అవార్డ్ విన్నర్ ఫిలిప్ జాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చెన్నై స్టోరీలో శ్రుతి హాసన్ ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఎన్ మురారి రచించిన ఫేమస్ నవల ది అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్ ఆధారంగా క్రాస్-కల్చరల్ రోమ్-కామ్ గా ఈ సినిమా రూపొందుతోంది. బ్లైండ్ బై ది లైట్, లిఫ్ట్ ఫేమ్ వివేక్ కల్రాతో కలిసి శ్రుతి నటిస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు హైలైట్ గా నిలవనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ షేర్ చేసింది శ్రుతి. ఇటీవల ఈ మూవీ షూటింగ్ మొదలైన విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపింది. కొత్త జర్నీ, కొత్త సినిమా అంటూ అప్డేట్ ఇచ్చింది.
ఈ మూవీలో చెన్నై కేంద్రంగా పనిచేసే ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో కనిపించనుంది శ్రుతి హాసన్. చెన్నై, కార్డిఫ్ నగరాల్లో ఈ సినిమా షూటింగ్ జరగనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నిజానికి ఫిలిప్ జాన్ తో వర్క్ చేయడానికి హీరోయిన్ సమంత.. ఇంట్రెస్ట్ చూపించింది. ఆ నవలను చదివి మరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఇంతలోనే ఆమె మయోసైటిస్ బారిన పడింది. అందుకు మెరుగైన చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకునేందుకు ఆ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో శ్రుతికి ఈ గోల్డెన్ ఛాన్స్ దక్కింది. చెన్నై అమ్మాయి అయినా తాను ఈ మూవీ చేయడం ఆనందంగా ఉందని ఇది వరకే చెప్పింది.