సినీపరిశ్రమలో ఒక్కో సీజన్లో ఒక్కో ఆర్టిస్టు హవా ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లు అవకాశాలు దక్కించుకోవడంతో పోటీ పడుతుంటారు. ప్రతి ఏడాది నలభైకి పైగా కొత్తనాయికలు దిగుమతి అవుుతంటారు. వీరిలో నిలదొ క్కుకునే వాళ్లు కొంతమందే. ఆ తర్వాత కూడా అవకాశాలు దక్కించుకోవాలంటే అదృ ష్టం కలిసిరావాలి. 2016లో పాప్‌కార్న్ అనే సినిమా ద్వారా మలయాళ చిత్రరం గ ప్రవేశం చేసింది సంయు క్త మీనన్. ఆమెకు తెలుగు ఎంట్రీ మాత్రం 2022లో భీవ్లూనాయక్ సినిమా ద్వారా వచ్చింది. పవన్ నాయిక అంటే స్పెషల్ గుర్తింపు ఉంటుంది కాబట్టి ఆ తర్వాత కూడా వరుస అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత బింబిసార, సార్ చిత్రాల్లో నటించిన ఈ భామ ఇప్పుడు వీరూపాక్షలో సాయిధరమ్‌కు జోడీగా కనిపించనుంది. కల్యాణ్ రామ్ డెవిల్లో కూడా నాయికగా నటిస్తోంది. ఇలా తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. సంయు క్తలో తెలుగు అమ్మాయి లుక్స్ ఉండటమే కారణం అని సినీ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే స్టార్స్ కాంబినేషన్ సినిమాలు చేయనుందని సమాచారం.
Advertisement
తాజా వార్తలు
Advertisement