అవికాగోర్ గత ఏడాది ‘పాప్ కార్న్’..’ఉమాపతి’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిందీలో ‘1920’ అనే సినిమాతోనూ మెప్పించే ప్రయత్నం చేసింది. కానీ ఆ సినిమాలేవి అనుకున్న ఫలితాలు సాధించలేదు. దీంతో చెన్నై..ముంబై..హైదరాబాద్ అంటూ కొత్త అవకాశాల కోసం చక్కెర్లు కొడుతుంది.
చివరికి ఎలాగూ ‘బ్లడీ ఇష్క్’ అనే మరో హిందీ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఇది కూడా డిలే అవుతుంది. ప్రస్తు తానికి చేతిలో ఉంది ఆ ఒక్క సినిమానే. అయినా మీడియా అటెన్షన్ మాత్రం డ్రా చేస్తుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లోనే ఉంటుంది.
తాజాగా అమ్మడు మరో కొత్త ఫోటోతో నెటి జనుల ముందుకొచ్చింది. ఇది గొ ఇక్కడ బ్యూటీ డిజైన్ మత్సకన్యనే తలపిస్తుంది. తెలుపువర్ణం పలుచని డిసైన్ లో అవికా చూడముచ్చటగా ఉంది.
పర్పెక్ట్ క్లీవేజ్ బ్యూటీని సైతం అంతే హైలైట్ చేసింది. అవికా బ్యూటీలోగానీ..రూపంలో గానీ ఎక్కడా మార్పులు రాలేదు. అదే అందంతో రెట్టించిన ఉత్సాహంలో కనిపిస్తుంది.