సూటులోన దాగెను అందం చందం. మతిచెడే రూపలావణ్యానికి తగ్గట్టే బోల్డ్ ఫోటోషూట్లతో మతులు చెడగొట్టడం పాపులర్ గాయని ఆండ్రియా స్టైల్. పాత ప్రేమాయణాలకు టాటా చెప్పేసిన ఈ బ్యూటీ ఇప్పుడు కొత్తగా ఫ్యాషన్ అండ్ సెన్స్ తో ప్రేమలో పడినట్టే కనిపిస్తోంది. తాజాగా సూటులోన స్పెషల్ డిజైనర్ ఆభరణాలతో మతులు చెడగొడుతోంది.
భారీ తనం నిండిన స్పెషల్ డిజైనర్ ఆభరణాలు.. నాచు రంగు బ్లేజర్.. దానికి తగ్గట్టే డార్క్ గ్రీన్ బ్యాక్ గ్రౌండ్ లో అద్భుతమైన ఫోటోషూట్ ఇది. ఆండ్రియా ఫియర్ లెస్ స్ట్రైకింగ్ ఫోజ్ ఆకట్టుకుంటోంది. యుగానికి ఒక్కడు చిత్రంలో కార్తీ సరసన వేడిగా నటించినా కానీ ఆండ్రియాలో ప్రత్యేకతకు ఇప్పటికీ ఫ్యాన్సున్నారు. ఇలా వైవిధ్యమైన కాన్సెప్ట్ ఉన్న ఫోటోషూట్లతో తిరిగి అగ్గి రాజేస్తోంది. వయసుతో పాటు ఫామ్ కోల్పోయిందని భావించిన వారికి ఆండ్రియా తనదైన శైలిలో సమాధానమిస్తోంది.
ఆండ్రియా ఇటీవల పూర్తిగా కెరీర్ పైనే శ్రద్ధ పెట్టింది. ఇంతకుముందు మాస్టర్ చిత్రంలో ఆండ్రియా కీలక పాత్రలో కనిపించింది. ఇటీవల నాలుగైదు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇవన్నీ సెట్స్ లో ఉన్నాయి. కమలా కన్నన్ దర్శకత్వంలో ‘వట్టామ్’.. మిస్కిన్ దర్శకత్వంలో ‘పిసాసు-2’ లో నటించింది. కా – మాలిగై- నో ఎంట్రీ సహా మరో రెండు చిత్రాల్లోను ఆండ్రియా నటించింది. బాబి ఆంటోని, దినేష్ సెల్వరాజ్ తెరకెక్కిస్తన్న సినిమాల్లో ను నటిస్తోంది.