‘బద్రి’ చిత్రంతో తెలుగు వారికి సుపరిచితమైన బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్. తెలుగులో పవన్ కల్యాణ్, మహేష్, బాలకృష్ణ లాంటి అగ్ర కథానాయకుల సరసన నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత బాలీవుడ్ కే పరిమితమైన సంగతి తెలిసిందే. హిందీ, మరాఠా చిత్రాల్లో నటిస్తూ బిజీ అయింది అమీషా ఇటీవలే గదర్ 2 (గదర్ సీక్వెల్) ఘనవిజయంతో మరోసారి అమీషా పేరు మార్మోగింది.
సన్నీడియోల్- అమీషా పటేల్ జోడీకి కెరీర్ లో మరపురాని అపూర్వ విజయం దక్కింది. ఆ తర్వాత ఎడాపెడా సినిమాలకు సంతకాలు చేసింది అమీషా. మరోవైపు సోషల్ మీడియాల్లోను ఈ బ్యూటీ మరింత స్పీడ్ పెంచింది.
తాజాగా అమీషా పటేల్ షేర్ చేసిన స్పెషల్ ఫోటోషూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.
ఈ బ్యూటీ సింపుల్ గా ఎల్లో టూపీస్ లో అందాలు ఆరబోసిన తీరు యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. అమీషా లేటు వయసులో ఘాటు అందాలు ఎర వేస్తోంది!! అంటూ ఘాటైన కామెంట్లు చేస్తున్నారు నెటిజనం. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.