Saturday, November 23, 2024

ఢిల్లీ ఏపీ భవన్​లో సంబురంగా అంబేద్కర్​ జయంతి..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ దేశ రాజధాని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్-తెలంగాణ భవన్ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో  బాబాసాహెబ్ భీంరావ్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, ఇరు భవన్ల సిబ్బంది, పోలీసు అధికారులు, పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా పీఆర్సీ ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ నిమ్న వర్గాలకు ఎనలేని సేవలు చేసి వారిలో చైతన్యం తీసుకువచ్చిన నాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని, సమానత్వం కోసం పరిశ్రమించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్య రంగాలలో సమానత్వం సాధించడానికి కృషి చేశారన్నారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల ద్వారా నిరుపేదలు ఉచితంగా ఉన్నత విద్యను పొందే అవకాశం కల్పించారని ప్రవీణ్ ప్రకాష్ వివరించారు. ఇంగ్లీషు మాధ్యమాన్ని  విద్యార్థులందరికి అందించి సమానంగా ఎదిగే సామర్థ్యాన్ని జగన్ కల్పించారని హర్షం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నారని, 2019 వరకు రాష్ట్రంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉండేవని, ప్రస్తుత ప్రభుత్వం 14 నూతన మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగాభవన్ ఉద్యోగులు దివంగత ఆనందరావు, లింగరాజుల సేవలను గుర్తు చేసుకున్నారు. తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రికి చెందిన చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement