మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ తళుక్కుమన్నది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆ బ్యూటీ క్యాట్‌వాక్ చేసింది. మెగాలోపోలిస్ ఫిల్మ్ కోసం ఆమె రెడ్‌కార్పెట్‌పై జిగేల్‌మన్నది. ఫాల్గుణి అండ్ షేన్ పీకాక్ డిజైనర్లు రూపొందించిన బ్లాక్ గౌన్‌లో ఐశ్వర్య దర్శనమిచ్చింది.
గత రెండు దశాబ్దాల నుంచి కేన్స్ ఫెస్టివల్లో ఐశ్వర్య.. ఫిల్మ్ లవర్స్‌ను థ్రిల్ చేస్తూనే ఉన్నది. త్రీడీ మెటాలిక్ ఎలిమెంట్స్ ఉన్న మోనోక్రోమ్ గౌన్‌లో ఐశ్వర్య కనిపించారు.
అయితే ఐశ్వర్య కుడి చేతికి ఇటీవల గాయమైంది. అయితే ఏ కారణం చేత ఆమెకు గాయమైందో తెలియదు. కానీ చేతి కట్టుతోనే ఆమె క్యాట్వాక్లో పాల్గొన్నది. ఐశ్వర్య కూతురు ఆరాధ్య కూడా ఫిల్మ్ ఫెస్టివల్లో కనిపించింది. కియారా అద్వానీ, సోభితా దూళిపాళ, ఆదితి రావు హైదరీతో పాటు ఇతర బాలీవుడ్ నటీనటులు కేన్స్‌లో దర్శనమిచ్చారు. 77వ కేన్స్ ఫెస్టివల్లో ఐశ్వర్య క్యాట్వాక్లో పాల్గొనడం ఇది 21వసారి.