Photo Gallery |ప్రియుడితో ఏడడుగులు.. అంజన పెళ్లి ఫొటోలు ఇవిగో!

హిందూ సంప్రదాయంలో పెళ్లి..
సోషల్ మీడియాలో వైరల్‌గా ఫొటోలు

ఆంధ్రప్రభ, సినిమా ప్రతినిధి: సినీ నటుడు అర్జున్ సర్జా చిన్న కుమార్తె అంజన తన ప్రియుడు ఇసాయ్ నట్టర్‌ను వివాహం చేసుకున్నారు. దాదాపు 14 ఏళ్ల ప్రేమ ప్రయాణానికి ముగింపు పలుకుతూ.. ఈ నెల 19న విదేశాల్లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అంజన, ఇసాయ్ నట్టర్‌ల పరిచయం అమెరికాలో మొదలైంది. అక్కడ చదువుకుంటున్న సమయంలో ఒకరికొకరు పరిచయమైన వీరిద్దరి మధ్య స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఈ బంధాన్ని కొనసాగిస్తూ వచ్చిన ఈ జంట, గతేడాది నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు

వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను అంజన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకలో వధూవరులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 14 ఏళ్ల ప్రేమ ప్రయాణం తర్వాత ఒక్కటైన ఈ జంటకు అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Photo Gallery
Photo Gallery
Photo Gallery
Photo Gallery