Photo Gallery | రెట్రో లుక్‌లో రాజకీయ నేతలు !

  • 80s ట్రెండ్‌లో పొలిటికల్ లీడర్స్..
  • సోషల్ మీడియాను ఊపేస్తున్న వింటేజ్ లుక్..
  • రాజకీయ నేతలూ ట్రై చేస్తున్న ట్రెండ్

హైదరాబాద్, ఆంధ్రప్రభ : సోషల్ మీడియాలో ప్రస్తుతం ‘80s ట్రెండ్’ హల్‌చల్ చేస్తోంది. ఏఐ సాయంతో ప్రస్తుత ఫొటోలను 1980ల నాటి వింటేజ్ లుక్‌లోకి మార్చుకోవడం నెటిజన్లకు కొత్త క్రేజ్‌గా మారింది. అప్పటి స్టైల్ తో ఫొటోలను రీ-ఇమాజిన్ చేస్తున్నారు. మొదట సినీ సెలబ్రిటీలు ఈ ట్రెండ్‌ను ఫాలో కాగా.. ఇప్పుడు రాజకీయ నాయకులూ ఇందులోకి ఎంట్రీ ఇస్తున్నారు.

సీఎం రేవంత్‌ నుంచి రాహుల్‌ వరకు..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ట్రెండ్‌లో భాగమయ్యారు. ‘జాయినింగ్ 80స్ ట్రెండ్’ అంటూ తన రెట్రో లుక్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించిన 80ల నాటి ఏఐ రెట్రో ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

లోకేశ్, విజయ్.. సోషల్ మీడియాలోనూ రెట్రో క్రేజ్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్, తమిళనాడు సీఎం విజయ్, కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు వంటి వారి రెట్రో లుక్స్ కూడా సోషల్ మీడియా వైర‌ల్ గా మారాయి. దీంతో 80ల నాటి ఫ్యాషన్, సినిమా స్టైల్, ఫొటోగ్రఫీపై కొత్త తరం ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తోంది. రాజకీయ నాయకులకు కూడా ఈ ట్రెండ్ తమను సోషల్ మీడియా ప్రేక్షకులకు మరింత క్యాజువల్‌గా, ట్రెండీగా చూపించుకునే అవకాశంగా మారింది.

కేవలం తెలుగు రాష్ట్రాలకే ఈ ట్రెండ్ పరిమితం కాలేదు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, కిరణ్ రిజిజు, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, శివరాజ్ సింగ్ చౌహాన్, అనురాగ్ ఠాకూర్ తదితరులు 80ల రెట్రో ట్రెండ్‌లో కనిపించారు. కొందరు ఏఐతో కొత్త ఫొటోలను రూపొందించుకోగా, మరికొందరు తమ నిజమైన పాతకాలపు ఫొటోలను షేర్ చేస్తున్నారు.

ఈ ట్రెండ్ ను మీరు ఫాలో కండి…

నా ఫేస్‌, ఫేస్‌ షేప్‌, స్కిన్‌ టోన్‌, ఎక్స్‌ప్రెషన్స్‌, ఒరిజినల్‌ ఫేస్‌ను యథాతథంగా ఉంచుతూ ఈ ఫొటోను 1980ల నాటి రెట్రో ఫొటోగా మార్చండి. ఆ కాలానికి అనుగుణంగా దుస్తులు, హెయిర్‌స్టైల్‌, ఆభరణాలను మార్చండి. వామ్‌ అనలాగ్‌ లైటింగ్‌, సహజమైన ఫిల్మ్‌ గ్రెయిన్‌, కొద్దిగా మసకబారిన రంగులు, సాఫ్ట్‌ ఫోకస్‌, సహజమైన బాడీ షేప్‌ను ఉపయోగించండి. కేవలం వింటేజ్‌ ఫిల్టర్‌ వేసినట్టుగా కాకుండా ఈ ఫొటో నిజంగా 1980లలో తీసినట్టుగా కనిపించేలా చేయండి. స్మార్ట్‌ఫోన్లు, ఆధునిక కార్లు, ప్రస్తుత కాలపు దుస్తులు వంటి ఆధునిక వస్తువులను తొలగించి, ఆ కాలానికి చెందిన సహజమైన బ్యాక్‌గ్రౌండ్‌ను రూపొందించండి.”

ఇలా స్పష్టమైన వివరాలతో ప్రాంప్ట్‌ ఇవ్వడంతో తమ సాధారణ ఫొటోలను నెటిజన్లు 1980ల నాటి జ్ఞాపకాలను తలపించేలా మార్చుకుంటున్నారు. దీంతో సోషల్‌ మీడియాలో 80ల రెట్రో ఫొటోల ట్రెండ్‌ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.