Asian Games 2026 – Photo Gallery | ఘనంగా ముగిసిన ఆసియా క్రీడలు..

(నాగోయా, ఆంధ్రప్రభ క్రీడాప్ర‌తినిధి)

జపాన్‌లోని ఐచి-నాగోయాలో రెండు వారాలకు పైగా సాగిన 2026 ఆసియా క్రీడలకు ఘనంగా ముగింశాయి. అక్టోబర్‌ 4న నాగోయా సిటీ మిజుహో పార్క్‌ అథ్లెటిక్‌ స్టేడియంలో జరిగిన ముగింపు వేడుకల్లో భారత బృందానికి డబుల్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ షూటర్‌ నీరు దండా త్రివర్ణ పతాకధారిగా వ్యవహరించారు.

మహిళల ట్రాప్‌ వ్యక్తిగత విభాగంతో పాటు కైనన్‌ చెనాయ్‌తో కలిసి మిక్స్‌డ్‌ టీమ్‌ ట్రాప్‌లో స్వర్ణాలు సాధించిన నీరూ.. మహిళల టీమ్‌ ట్రాప్‌లో రజత పతకాన్ని కూడా గెలుచుకున్నారు. ఈ ఘనతతో ముగింపు వేడుకల్లో భారత బృందాన్ని ముందుండి నడిపించారు.

ఈ ఆసియా క్రీడల్లో భారత్‌ మొత్తం 85 పతకాలు సాధించి పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలు ఉన్నాయి. ఆసియా క్రీడల చరిత్రలో భారత్‌కు ఇది రెండో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.

ముగింపు వేడుకల్లో ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్‌ జెండా, క్రీడల జ్యోతిని తదుపరి ఆతిథ్య దేశమైన ఖతార్‌లోని దోహాకు అధికారికంగా అప్పగించారు. 2030లో జరగనున్న 21వ ఆసియా క్రీడలకు దోహా ఆతిథ్యం ఇవ్వనుంది.