Pest Control | న‌ట్ట‌ల నివార‌ణ మందు స‌ద్వినియోగం చేసుకోండి…

Pest Control | న‌ట్ట‌ల నివార‌ణ మందు స‌ద్వినియోగం చేసుకోండి…

Pest Control | కడెం ( నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : మేకలకు, గొర్రెలకు నట్టల నివారణ(Pest Control)కై నట్టల మందు వేయాల‌ని ఈ రోజు పశువైద్యాధికారి డాక్టర్ ఈ సౌందర్య అన్నారు. ఈ రోజు కడెం మండలంలోని మాసాయిపేట్ గ్రామంలో పశువైద్య, పశు సంవర్ధక శాఖ(Animal Husbandry Department) ఆధ్వర్యంలో గొర్రెలలో, మేకలలో ఉచిత నట్టల నివారణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ సౌందర్య మాట్లాడుతూ… గొర్రెల పెంపకదారులందరూ న‌ట్ట‌ల నివార‌ణ మందు స‌ద్వినియోగం చేసుకోండ‌న్నారు. ఈ కార్యక్రమంలో లింగాపూర్ మద్దిపడగ జేవీఓలు, జే.రాజేశ్వర్, విజయ ఓఎస్ రాజేశ్వర్, రైతులు, నాయకులు, మేకల గొర్రెల పెంపకం దారులు పాల్గొన్నారు.

Leave a Reply