ప్ర‌జాపాల‌న‌కు ప్రజల గ్రీన్ సిగ్నల్..

  • సంబరాల్లో టీపీసీసీ కార్యదర్శి దండుగుల

ఓల్డ్ బోయిన్పల్లి, ఆంధ్ర ప్రభ : రాష్ట్ర అభివృద్ధి కోసం గత రెండు సంవత్సరాలుగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి పనులే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుకు దారితీశాయని టీపీసీసీ కార్యదర్శి దండుకుల యాదగిరి అన్నారు.

నవీన్ యాదవ్ విజయాన్ని పురస్కరించుకుని ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్ హస్మత్‌పేట్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద, హస్మత్‌పేట్ స్టార్ కేఫ్, అంజయ్యనగర్ ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరి టపాకాయలు కాల్చి, కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరిపారు. “రేవంత్ రెడ్డి జిందాబాద్”, “కాంగ్రెస్ పార్టీ జయహో” అంటూ నినాదాలు చేస్తూ వాతావరణం ఉత్సాహభరితంగా మారింది.

ఈ సందర్భంగా దండుకుల యాదగిరి మాట్లాడుతూ.. “తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ నేతలు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని దివాలా తీసే స్థితికి చేర్చారు. అలాంటి పరిస్థితుల్లో గత రెండు సంవత్సరాలుగా ప్రజాసంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు నమ్మకం కలిగించాయి. ఆ విశ్వాసమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం దక్కడానికి కారణం” అన్నారు.

కాంగ్రెస్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.

Leave a Reply