అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు
- ఎన్డీయే కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్
- సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి
భవానిపురం, ఆంధ్రప్రభ: పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేశామని అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఏపీ బీజేపీ ఎక్ భారత్ శ్రేష్ట్ భారత్ కన్వీనర్ పీయూష్ దేశాయ్,మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, జనసేన పార్టీ 42 వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్లు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వృద్ధులు వితంతువులు , ఒంటరి మహిళలు,దివ్యాంగుల వివరాలను తీసుకొని నమోదు చేస్తున్నామన్నారు. వారం రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.బీజేపీ సీనియర్ నాయకులు దుర్బేసుల హుస్సేన్ పాల్గొన్నారు.
