Collector | భీమవరంలో పెన్షన్లు పంపిణీ

Collector | భీమవరంలో పెన్షన్లు పంపిణీ
Collector | (భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో) : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను (Pension) లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. సోమవారం భీమవరం పట్టణం గునుపూడి 11వ వార్డులోని అరుంధతిపేట నందు వృద్ధాప్య, దివ్యాంగ, వితంతు పింఛన్లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా అందజేశారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ నెల నెల ఇంటికి వచ్చి పెన్షన్ అందిస్తున్నారా, సకాలంలో అందుతుందా, ఎంత ఇస్తున్నారు, ఆరోగ్యం ఎలా ఉంది ఆరా తీశారు.
పెన్షన్ల మొత్తంలో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ (Collector) చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పథకం కింద జిల్లాలో సోమవారం 2,26,995 మందికి పెన్షన్లను ఉదయం 6.00 గంటల నుండి సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ ప్రారంభించడం జరిగిందని, ఈ పింఛన్ల కింద జిల్లాకు రూ.97.29 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు . పేద వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మన ముఖ్యమంత్రి ఆశయ సాధన మేరకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక బద్ధంగా కృషిచేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఏ పిడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, డిపిఎం మురళీకృష్ణ, మున్సిపల్ సహాయ కమిషనర్ ఎ.రాంబాబు, తహసిల్దార్ రావి రాంబాబు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
