జాతీయ స్థాయి పెన్కాక్ సిలాట్‌కు విస్సన్నపేట బాలిక ఎంపిక

జాతీయ స్థాయి పెన్కాక్ సిలాట్‌కు విస్సన్నపేట బాలిక ఎంపిక
ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే కొలికపూడి
పంజాబ్‌లో జరగనున్న పోటీలకు నిక్షిత అర్హత..
రూ.10,000 సహాయం అందజేత
చిన్న వయసులోనే జాతీయ స్థాయికి అడుగుపెట్టిన ప్రతిభకు అభినందనలు
తిరువూరు, ఆంధ్రప్రభ : తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేటకు చెందిన పి. నిక్షిత జాతీయ స్థాయి పెన్కాక్ సిలాట్ పోటీలకు ఎంపికై ప్రతిభ చాటింది. ఈ నేపథ్యంలో ఆమెకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించారు.ఈ నెల 31న పంజాబ్‌లో జరగనున్న జాతీయ స్థాయి పెన్కాక్ సిలాట్ పోటీలకు ఎంపికైన విస్సన్నపేట గ్రామానికి చెందిన పి. నిక్షితను స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అభినందించారు. చిన్న వయసులోనే జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిక్షితకు రూ.10,000 నగదు ఆర్థిక సహాయం అందజేసి, పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చాలని ఆకాంక్షించారు. క్రీ
డాకారిణిగా ఉన్నత స్థాయికి ఎదిగి రాష్ట్రానికి కీర్తి తేవాలని ఆశీర్వదించారు. క్రీడారంగంలో ముందుకు రావాలనుకునే యువతకు ఇలాంటి ప్రోత్సాహం ఎంతో అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రతిభ వెలుగులోకి వస్తోందని తెలిపారు. నిక్షిత కుటుంబ సభ్యులు స్పందిస్తూ, తమ కుమార్తె ప్రతిభను గుర్తించి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రోత్సాహం తమకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
