Peddi Controversy | చరణ్‌, బుచ్చి సారీ చెబుతారా..?

Peddi Controversy | చరణ్‌, బుచ్చి సారీ చెబుతారా..?

Peddi Controversy | చికిరి సాంగ్ వివాదం..
క్షమించండి – బుచ్చిబాబు..
అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలి..

Peddi Controversy | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు.. ఈ ఇద్దరి కాంబోలో రూపొందిన సినిమా పెద్ది. ఈ సినిమాని ఏ ముహుర్తాన ప్రారంభించారో కానీ.. సినిమా పూర్తవ్వడం బాగా ఆలస్యం అయ్యింది. అలాగే వివాదాల్లో చిక్కకుంది. ఇప్పుడు ఈ క్రేజీ మూవీ థియేటర్లోకి వచ్చిన తర్వాత కూడా వివాదస్పదం అయ్యింది. లేటెస్ట్ గా పెద్ది పెద్ద వివాదంలో చిక్కుకుంది. అసలు ఏం జరిగింది..? ఏంటా వివాదం..?

Peddi Controversy | చికిరి సాంగ్ వివాదం..

పెద్ది సినిమా నుంచి చికిరి చికిరి అనే పాటను రిలీజ్ చేసినప్పుడు.. ఈ పాటలో..పడతా పడతా పడతా ఎనుకే ఎనుకే పడతా.. సరుకు సామాన్లు సూసి మీసం లేసి ఏసే కేక.. చికిరి చికిరి అనే లిరిక్స్ విపిస్తాయి. ఈ పాట విడుదలైనప్పుడు.. సరుకు సామాన్లు అనే పదం ఉపయోగించడంతో వివాదస్పదం అయ్యింది. అయితే థియేటర్లలో సినిమా చూసిన ఫ్యాన్స్.. ఈ సాంగ్ వచ్చినప్పుడు షాక్ అయ్యారు. ఎందుకంటే సరుకు సామాన్లు అనే లిరిక్స్ తీసేసారు. వాటి స్థానంలో సొగసు సింగారం అనే కొత్త పదాలను వినిపించారు.

Peddi Controversy

Peddi Controversy | క్షమించండి – బుచ్చిబాబు..

సినిమా రిలీజైన తర్వాత జాన్వీ కపూర్ పాత్రను చూపించిన విధానం బాలేదు అంటూ విమర్శలు వచ్చాయి. ఆమె పాటలకే పరిమితం అయ్యింది. పైగా అందాల ఆరబోత ఎక్కువ అయ్యిందని.. అలాగే ఆమె చెప్పే డైలాగులు కూడా ఏమాత్రం బాలేదనే కామెంట్లు గట్టిగా వినిపించాయి. అయితే.. ఈ విమర్శలను స్వీకరించిన దర్శకుడు బుచ్చిబాబు.. ఎవర్ని బాధపట్టాలని హీరోయిన్ క్యారెక్టర్ ని అలా డిజైన్ చేయలేదు. ఎవరికైనా బాధపెట్టినట్టు అయితే.. క్షమాపణలు చెబుతున్నాను.. అలాగే కొన్ని సీన్స్ ను తీసేస్తున్నట్టుగా తెలియచేస్తూ బుచ్చిబాబు ఓ లేఖను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.

Peddi Controversy

Peddi Controversy | అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలి..

తాజాగా పెద్ది మరో వివాదంలో చిక్కుకుంది. ఈ మూవీలో గిరిజనులను కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి అంటూ విజయనగరంలోని పలు ఆదివాసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి. అంతే కాకుండా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. చిత్ర బృందంతో పాటు సెన్సార్ ఆఫీసర్స్ పై ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసారు. సనాతన ధర్మంలోని రామాయణం, మహాభారతాల్లో తమ పూర్వీకులు కీలక పాత్రలు పోషించారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఊహించని వివాదంలో పెద్ది చిక్కుకోవడంతో.. దీనికి చరణ్‌, బుచ్చిబాబు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆసక్తిగా మారింది.

Peddi Controversy

CLICK HERE TO READ Tollywood | కథ చెప్పారు.. బ్లాక్‌బస్టర్ కొట్టారు!

CLICK HERE TO READ MORE

Leave a Reply