Peddi | ‘పెద్ది’ పై ఐకాన్ స్టార్ సెన్సేషనల్ కామెంట్స్!
Peddi | ‘పెద్ది’ పై ఐకాన్ స్టార్ సెన్సేషనల్ కామెంట్స్!
Peddi | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్, డ్యాన్స్‌పై ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. టాలీవుడ్ నటులు, దర్శకులు సైతం ఆయన నటనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పెద్ది’ సినిమాను చూసి, తన అనుభూతిని ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా పంచుకున్నారు.
‘పెద్ది’ చిత్రంలో రామ్ చరణ్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశాడంటూ బన్నీ హర్షం వ్యక్తం చేశారు. చరణ్ కెరీర్లోనే ఇదొక అత్యుత్తమ, అద్భుతమైన ప్రదర్శన. చరణ్ మార్చిన రగ్గడ్ లుక్, ఊర మాస్ బాడీ ట్రాన్స్ఫార్మేషన్ అసాధారణమని అల్లు అర్జున్ అన్నారు.
నటనతోనే కాకుండా తన గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ మూవ్స్‌తో చరణ్ ప్రతి అంశంలోనూ ‘పెద్ది’గా అదరగొట్టాడని బన్నీ ట్వీట్ చేశారు. రామ్ చరణ్ సాధించిన ఈ భారీ విజయానికి, థియేటర్లలో దక్కుతున్న చప్పట్లకు తాను ఎంతగానో గర్వపడుతున్నట్లు అల్లు అర్జున్ పేర్కొన్నారు.
దర్శకుడు బుచ్చిబాబు సన ప్రతి ఒక్కరి పాత్రను అద్భుతంగా ఎలివేట్ చేస్తూ.. చరణ్ ఇమేజ్ను మరో సరికొత్త శిఖరానికి తీసుకెళ్లారంటూ బన్నీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
