Peddapalli | ఆలయాల్లో వైకుంఠ శోభ
- ఉత్తర ద్వార దర్శనం
Peddapalli | పెద్దపల్లి, ఆంధ్రప్రభ : ఆలయాల్లో వైకుంఠ శోభ నెలకొంది. ఇవాళ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు ఇతర ఆలయాల్లోకి వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. తెల్లవారుజామునే ఆలయ అర్చకులు వేదమంత్రోత్సవాల మధ్య స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. వెంకటేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దర్శనం కోసం రెండు గంటల సమయం పడుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.


