పైడమ్మ తల్లి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

వరుణ జపం, వరుణ యాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్

పెడన, ఆంధ్రప్రభ : పెడన పట్టణంలోని శ్రీ పైడమ్మ తల్లి ఆలయంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వరుణ జపం, వరుణ యాగం కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ దేవుని ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ రైతాంగం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. అలాగే పెడన నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని శ్రీ పైడమ్మ తల్లిని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు.