పెద్దారెడ్డి కథ సుఖాంతం

  • తాడిపత్రికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే
  • భారీ పోలీసు బందోబస్తు
  • హైదరాబాదులో జెసి కుటుంబం

అనంతపురం బ్యూరో, సెప్టెంబర్ 6 (ఆంధ్రప్రభ) : తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే (Tadipatri Former MLA) కథ సుఖాంతమైంది. గడచిన 14 నెలల నుంచి ఆయన తాడిపత్రి కి వెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలను జెసి ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. దీనిపై పెద్దారెడ్డి పలుమార్లు హైకోర్టుకు వెళ్లారు. పెద్దారెడ్డి తన ఇంటికి వెళ్లడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. శాంతి భద్రతల సమస్యగా ఉంది అని ప్రభుత్వం తరఫున జస్టిస్ బట్టు బెంచ్ కి ఆశ్రయించింది. మొదట ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించారు. దీంతో పెద్దారెడ్డి (Pedda Reddy) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో పెద్దారెడ్డికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆయనను తాడిపత్రిలో ఉన్న తన ఇంటికి పంపించాలని ఆదేశించింది. ఏవైనా ఇబ్బందులు ఉంటే మరిన్ని బలగాలను తీసుకోవాలని పోలీసులకు సూచించింది.

ఇవే కాకుండా పలు కండిషన్లను సుప్రీంకోర్టు జారీ చేసింది. సుప్రీంకోర్టు (Supreme Court) జారీ చేసిన ఉత్తర్వులను పెద్దారెడ్డి జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. 5వ తేదీ తర్వాత తాడిపత్రిలోకి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. ఇందులో భాగంగానే శనివారం ఉదయం పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకెళ్లారు. జిల్లా ఎస్పీ జగదీష్ తో పాటు ఇతర అధికారులు దగ్గర ఉండి శాంతిభద్రతలను పర్యవేక్షించారు. తెలుగుదేశం వైసిపి నాయకులు తాడిపత్రి (Tadipatri ) పట్టణంలోకి రాకుండా ఎక్కడికి అక్కడ కొందరి నాయకులను గృహ నిర్బంధం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద పోలీస్ పీకేటింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు కాలేజీ గ్రౌండ్లో ఏ ఒక్కరు ఉండకుండా ఎస్పీ ఆధ్వర్యంలో ఆ ప్రాంతాన్ని తనిఖీ చేశారు.


జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) బావ చనిపోవడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తో పాటు ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ కు వెళ్లారు. అంతక్రియలు పూర్తయిన వెంటనే వారు తిరిగి తాడిపత్రికి రానున్నారు. అయితే రెండు రోజులకు ముందు తాడిపత్రిలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అందరికీ ఆహ్వానాలు పంపించారు. బావ మరణించడంతో కార్యక్రమాలను అన్నింటినీ రద్దు చేసుకొని హైదరాబాద్ కు వెళ్లారు.

Leave a Reply