Pawan Kalyan Birthday | పవన్ బర్త్‌డేకు సుజీత్ స్పెషల్ ట్రీట్.. ఫ్యాన్స్ కోసం ‘OG’ యూనివర్స్ వీడియో!
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ‘OG’ టీమ్ ఆయన పుట్టిన రోజు సందర్బంగా సర్ ప్రైజ్ ఇచ్చింది. దర్శకుడు సుజీత్ ‘OG’ సినిమా ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూనే.. ఇకపై మొదలయ్యే కొత్త ప్రయాణంపై ఓ ఆసక్తికర వీడియోనే విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్ చెప్పారు.
ఈ పోస్ట్ లో “From the #OGUniverse To the #OG” అంటూ మొదలుపెట్టిన సుజీత్.. ఇప్పటివరకు జరిగిన ప్రతిదానికీ, ఇక నుంచి ప్రారంభం కానున్న ప్రతిదానికీ తన ప్రేమ ఉంటుందని పోస్ట్ లో పేర్కొన్నారు.
‘OG’ యూనివర్స్
పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా ‘OG’ నుంచి అభిమానులకు ఓ ప్రత్యేకమైన ట్రీట్ రాబోతున్నట్లు ఇప్పటికే ఆసక్తి నెలకొంది. దీంతో సుజీత్ పోస్ట్ మరింత హైప్ పెంచింది. ‘OG’ యూనివర్స్ ఎలా ఉండబోతుంది..? ఇందులో కొత్తగా వచ్చే క్యారెక్టర్స్ ఏంటి..? అనే దానిపై ఆసక్తి నెలకొంది.
పవన్ కళ్యాణ్–సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘OG’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. పవన్‌ను సుజీత్ ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో కొనసాగుతోంది. తాజాగా దర్శకుడి బర్త్‌డే పోస్ట్‌తో ఈ అంచనాలు మరింత పెరిగాయి.
