శ్రీకాకుళంలో ఘనంగా పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు
కేక్ కట్ చేసి ర్యాలీగా అవనిగడ్డకు బయలుదేరిన జనసేన శ్రేణులు
ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళంలో నూతన బస్‌స్టాప్ వద్ద జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు సుగ్గున పవన్‌కుమార్ ఆధ్వర్యంలో భారీ కేక్‌ను ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీకాకుళం కరగట్ట మీద నుంచి జనసేన నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా అవనిగడ్డకు బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు మత్తి వెంకటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, మాజీ సర్పంచ్ ముప్పనేని రవిప్రసాద్, ఏఎంసీ వైస్ చైర్మన్ అత్తలూరి గోపీచంద్ పాల్గొన్నారు.
పీఏసీఎస్ అధ్యక్షుడు తిరుమలశెట్టి రాంబాబు, మాజీ ఎంపీటీసీ ఏ. సీతారామరాజు, మునిపల్లి బుజ్జి, డీసీ వైస్ చైర్మన్ సుగ్గన రాంబాబు, జనసేన నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
