పవన్ అడుగడుగునా సామాన్యుడి పక్షం..

ఆంధ్రప్రభ వెబ్ డస్క్: ఏపీ డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) జన్మదినం(Birthday) సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) ఆయనకు ట్విట్టర్(Twitter) వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

పవన్ అడుగడుగునా సామాన్యుడి పక్షం.. అణువణువునా సామాజిక స్పృహ.. మాటల్లో పదును.. చేతల్లో చేవ.. జన సైన్యా నికి ధైర్యం .. మాటకి కట్టుబడే తత్వం .. రాజకీయాల్లో
విలువలకు పట్టం .. స్పందించే హృదయం .. అన్నీ కలిస్తే పవనిజం అని కొనియాడారు.


నమ్మే అభిమానుల, కార్యకర్తల, ప్రజల దీవెనలతో మీరు నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి. మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి. పాలనలో, రాష్ట్రాభివృద్దిలో మీ సహకారం మరువలేనిది అని తెలియజేస్తూ.. పవన్ కు పుట్టినరోజు శుభాకాం క్షలు.” అని సీఎం ఎక్స్ లో చేసిన పోస్టులో పేర్కొ న్నా రు. పవన్ తో తమ స్నేహం ముందు సాగాలని కోరుకున్నట్లు చంద్రబాబు ఆకాంక్షించారు.

Leave a Reply