Parkal | ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి

Parkal | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్యంపై నమ్మకంతో పోలింగ్‌లో పాల్గొన్న పరకాల పట్టణ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలియజేశారు. ఎన్నికల కాలమంతా అహర్నిశలు శ్రమిస్తూ, ఇంటింటి ప్రచారం నుంచి పోలింగ్ రోజు వరకు పార్టీ పతాకాన్ని గౌరవంగా మోసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగం, యువజన విభాగం, అనుబంధ సంఘాల శ్రేణులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అంకితభావం, త్యాగం, పార్టీపై ఉన్న అపార విశ్వాసమే మాకు నిజమైన బలం అని, పరకాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలుస్తుందని మరోసారి స్పష్టం చేశారు. మరొక్కసారి పరకాల ప్రజలకు, బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నా మనస్ఫూర్తి ధన్యవాదాలు అని ధర్మారెడ్డి తెలియజేశారు.

Leave a Reply