గ్రూప్‌-1 ర్యాంక‌ర్ల త‌ల్లిదండ్రులు ఆవేద‌న‌

గ్రూప్‌-1 ర్యాంక‌ర్ల త‌ల్లిదండ్రులు ఆవేద‌న‌

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు(politics) చేయొద్ద‌ని గ్రూప్-1 ర్యాంకర్ల తల్లిదండ్రులు కోరారు. రూ.3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారని కొందరు ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్(Somajiguda Press Club)లో ర్యాంకర్లు వారి తల్లిదండ్రులు మీడియా సమావేశం నిర్వహించారు. అసత్య ఆరోపణలతో మనోవేదనకు గురిచేస్తున్నారని పలువురు తల్లిదండ్రులు అవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

గ్రూప్-1 పరీక్షల వివాదాన్ని రాజకీయం చేయొద్దని, కొందరు నేతలు ఆసత్య ఆరోపణలు చేస్తున్నార‌ని త‌ల్లిదండ్రులు మండిప‌డ్డారు. ఆరోపణలు చేసేవారు వాటిని నిరూపించాల‌న్నారు. అప్పులు చేసి(Debt), ఓ పూట తిని.. మరో పూట తినక రెక్కలు ముక్కలయ్యేలా త‌మ‌ పిల్లలను కష్టపడి చదివించామ‌న్నారు. ఎన్నో త్యాగాలు చేసి చదివిస్తే రూ. కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నట్లు నిందలు వేయ‌డం స‌రికాదు. మీ రాజకీయాల(Politics) కోసం త‌మ‌ పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దు అని విజ్ఞ‌ప్తి చేశారు.

అన్నిపార్టీల నేతలు సహకరించాలి
పోస్టులు కొన్నామన్న ప్రచారంతో త‌మ‌ పిల్లలు ఇబ్బంది పడుతున్నార‌ని, పోస్టులు(Posts) కొనుక్కున్నామన్నఆరోపణలపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామ‌ని, నిందలు వేసి మమ్మల్నిమనోవేదనకు గురవేయొద్దు అన్ని పార్టీల నేతలకు విజ్ఞ‌ప్తి చేశారు. త‌మ‌కు అన్ని పార్టీలు స‌హ‌క‌రించాల‌ని కోరారు.

Leave a Reply