పేదల పెన్నిధి వైఎస్సార్
కాంగ్రెస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
పరకాల, ఆంధ్రప్రభ : పేదల పెన్నిధి, దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ పరకాల పట్టణ అధ్యక్షుడు ఒంటేరు శ్రవణ్‌కుమార్ అన్నారు. బుధవారం పరకాల పట్టణ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వైఎస్సార్ 17వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. పట్టణ అధ్యక్షుడు ఒంటేరు శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ.. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజా సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.
108 సేవలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు రుణమాఫీ తదితర సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్సార్‌కు దక్కుతుందని కొనియాడారు. పేదలు, రైతులు, బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఒంటేరు రామ్మూర్తి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఏకు దివ్య విద్యాసాగర్, తాజా మాజీ కౌన్సిలర్లు పోరండ్ల సంతోష్, గూడెల్లి సదన్‌కుమార్, కొయ్యడ శ్రీనివాస్, బండి శ్రీధర్, పసుల లావణ్య రమేష్, బొచ్చు సాల్మన్, సుధమల్ల రమేష్, జిల్లా కార్యదర్శి జాఫర్ రిజ్వి, కాంగ్రెస్ నాయకులు ఎండీ రంజాన్ అలీ, బుర్ర రాజమౌళి, కొక్కిరాల తిరుపతిరావు, బొచ్చు భాస్కర్, ఐలిపెళ్లి స్వామి, మడికొండ సంపత్, గొట్టే రమేష్, బొచ్చు జితేందర్, గోవిందు కుమారస్వామి, లక్కం రమేష్, మహిళా నాయకురాళ్లు లక్కం వసంత, దాసరి ఉమా తదితరులు పాల్గొని వైఎస్సార్‌కు నివాళులర్పించారు.
