క్యాంపు నుండి నేరుగా ప్రమాణ స్వీకారానికి..

క్యాంపు నుండి నేరుగా ప్రమాణ స్వీకారానికి..

పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు


పరకాల, ఫిబ్రవరి 16 (ఆంధ్రప్రభ): కాంగ్రెస్ పార్టీ క్యాంపు నుండి గెలుపొందిన కౌన్సిలర్లు నేరుగా ప్రమాణ స్వీకారానికి చేరుకున్నారు. పరకాల పురపాలక సంఘం 22 వార్డుల్లో ఈనెల 11వ తేదీన సాధారణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించగా ఈనెల 13వ తేదీన పోలింగ్ కౌంటింగ్ చేశారు. పురపాలక సంఘం 22 వార్డుల్లో 13మంది కాంగ్రెస్ పార్టీ, ఆరుగురు బిఆర్ఎస్ పార్టీ, ముగ్గురు బిజెపి పార్టీ నుండి గెలుపొందారు.

13వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గెలిచిన 13 మంది కౌన్సిలర్లను క్యాంపున‌కు తరలించారు. ఇవాళ‌ ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారానికి ఒక బస్సులో పరకాల మున్సిపాలిటీ కార్యాలయానికి నేరుగా చేరుకున్నారు. అనంతరం పరకాల ఆర్డీఓ డాక్టర్ నారాయణ కౌన్సిలర్స్ చే ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార‌ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ కమిషనర్ ఎస్ అంజయ్య, పరకాల ఎంపీడీవో రవీందర్, తదితరులున్నారు.

Leave a Reply