వీణవంక, ఆంధ్రప్రభ : మరో లంచగొండి పంచాయితీ కార్యదర్శి (Panchayat Secretary) అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. శుక్రవారం కరీంనగర్ (Karimnagar) జిల్లా వీణవంక మండలం చెల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి కుంభం నాగరాజు లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB)కి పట్టుబడ్డాడు.

హౌస్ కన్ స్ట్ర‌క్షన్‌కు సంబంధించి ఇంటి నెంబర్ ఇచ్చేందుకు బాధితుడి నుంచి రూ.20 వేలు లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు (Officers) తెలిపారు. బాధితుడు ఏసీబీని సంప్రదించగా అధికారులు నాగరాజు (Nagaraju) ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ విజయ్‌కుమార్ (Vijaykumar) వెల్లడించారు.

Leave a Reply