పామర్రులో ఓటు వేసిన ఎమ్మెల్యే దంపతులు

ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

పామర్రు, ఆంధ్రప్రభ : పామర్రులో నిర్వహిస్తున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని సూచించారు. పామర్రు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు.