ఖమ్మం, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ సర్కార్ (congress circar ) అంటేనే కర్షకుల ప్రభుత్వం (farmers governament ) అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(deputy cm Bhatti vikramark ) అన్నారు. ఖమ్మం జిల్లాలో పాలేరు జలాశయం (paleru reservoir ) నుంచి సాగర్ ఆయకట్టుకు (sagar ayakattu ) సోమవారం భట్టి విక్రమార్కతోపాటు రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (minister ponguleti srinivasareddy ) నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే.. వ్యవసాయం, కరెంటు, ప్రాజెక్టులు అని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేదని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే.. కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. ఆనాడు తప్పిదాలు చేసిందే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అని ఆరోపించారు. తప్పులు చేసిన భారత రాష్ట్ర సమితి నేతలు ఇప్పుడు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

తప్పులు చేసింది కేసీఆర్.. మూల్యం చెల్లిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం
కేసీఆర్ పాలనలో చేసిన తప్పిదాలకు తమ ప్రభుత్వం మూల్యం చెల్లిస్తోందని భట్టి అన్నారు. గతంలో శ్రీశైలంపైన ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లు కడుతుంటే అడ్డుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం సహకరించిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ . తమ ప్రభుత్వంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేసి కాపాడుకుంటామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయం, రైతులకు అండగా నిలిచిందని చెప్పారు. ఆనాడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశామని గుర్తుచేశారు. ఆనాడు కేసీఆర్, హరీష్‌రావు, కేటీఆర్ తప్పులు చేసి వాటిని ఇప్పుడు తమపై రుద్దాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా….
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా రైతు పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ , సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రైతు భరోసా ద్వారా రైతులకు ఎకరాకు రూ.12 వేలు అందించామని గుర్తు చేశారు. వారి ఖాతాల్లో 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు జమ చేశామన్నారు. సన్నధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన పంటలకు కూడా ఇస్తామని చెప్పారు.

ప్రతి హామీని నిలబెట్టుకుంటాం…
రాష్ట్రంలో 2,55,324 లక్షల ఎకరాలకు సాగునీటిని విడుదల చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. గత ఏడాది కనీవినీ ఎరుగని వరదల కారణంగా సాగర్ మెయిన్ కెనాల్ పూర్తిగా కొట్టుకుపోయిందని.. దానిని పునరుద్ధరించామని తెలిపారు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు పూర్తి స్దాయిలో సాగునీరు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. కృష్ణా బేసిన్‌లో వచ్చే నీటితో మొదటి పంటకు ఎలాంటి ఢోకా లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వరుణ దేవుడి అండ ఉందని.. ఇది శుభసూచకమని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పచేసినా.. తమ ప్రభుత్వంలో రైతులకు అండగా నిలబడ్డామని చెప్పారు.
2.5 లక్షల ఎకరాలకు సాగు నీరు
కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ నుంచి సాగర్ నీటిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేడు విడుదల చేశారు. జిల్లాలో 2.50లక్షల ఎకరాలకు పాలేరు రిజర్వాయర్ నుంచి 1500 క్యూసెక్కుల సాగు నీటిని రెండో జోనుకు మంత్రులు విడుదల చేశారు.