ఏపీలో పాకిస్థాన్‌ స్పై నెట్‌వర్క్‌ కలకలం

ఏపీలో బ‌య‌ట‌ప‌డిన కుట్ర‌లు
ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్‌డెస్క్‌: ఏపీలో గూఢ‌చ‌ర్యం వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపుతోంది. ఆపరేషన్‌ ఫైర్‌వాల్‌తో ఉగ్రవాదుల భారీ కుట్ర భగ్నం అయింది. కౌంట‌ర్ ఇంటెలిజెన్స్ జరిపిన దాడుల్లో మెుత్తం 18 మందిని గుర్తించగా వారిలో 13 మంది నేవీ సిబ్బంది అనుమానితులుగా గుర్తించారు.

12 కౌంటర్ ఇంటెలిజెన్స్‌ బృందాలతో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు నిర్వ‌హించారు. ఈ సోదాలలో ఎన్‌క్రిప్టెడ్‌ ఛానళ్ల ద్వారా పాకిస్థాన్‌ కౌంటర్‌ ఇంటిలిజెన్స్‌తో నేరుగా టచ్‌లో ఉన్నట్లు గుర్తించారు. భారత్‌ కు చెందిన రహస్య సమాచారాన్నిసేకరించి పాక్‌ ఆపరేటివ్‌కు చేరవేసినట్లు సమాచారం. నేవీ, రక్షణ సంస్థల సమచారమే టార్గెట్‌గా గూఢచర్యం చేసినట్లు తెలుస్తోంది.. అనుమానితుల నుంచి ఎలక్ట్రానిక్‌ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ప‌ట్నం కేంద్రంగా గూఢ‌చ‌ర్యం వ్య‌వ‌హారం కొన‌సాగిన‌ట్లు ఏపీ సీఐ సెల్ గుర్తించింది. ఏపీ, కేరళ, మహారాష్ట్ర సహా 10 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో మెుత్తం ఇద్దరిని కౌంటర్ ఇంటిలిజెన్స్‌ సభ్యులు అరెస్ట్ చేశారు. మెుత్తం 18 మందిలో ఇద్దరి పాత్రపై ప్రాథమిక ఆధారాలు లభించగా మిగతా 16 మంది అనుమానితులపై దర్యాప్తు కొనసాగుతోంది.