Pak | రివార్డు పెంచిన పాక్..
రూ.24 లక్షలకు పెంపు
ఎఫ్‌ఏటీఎఫ్ సమావేశాల వేళ నిర్ణయం..
అఫ్గానిస్థాన్‌లో ఉన్నాడంటున్న పాక్
Pak | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : జైషే మహమ్మద్ (జేఈఎం) ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజర్‌పై పాకిస్థాన్ రివార్డును పెంచింది. ఇప్పటి వరకు రూ.17 లక్షలుగా ఉన్న బహుమతి మొత్తాన్ని రూ.24 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) సమావేశం సమీపిస్తున్న నేపథ్యంలో పాక్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మసూద్ అజర్ ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌కు పారిపోయాడని పాకిస్థాన్ చెబుతోంది. అతడి ఆచూకీ కోసం చర్యలు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.
భారత్‌లో జరిగిన పలు కీలక ఉగ్రదాడుల్లో మసూద్ అజర్ హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2001లో భారత పార్లమెంటుపై దాడి, 2008 ముంబయి ఉగ్రదాడులు, 2016 పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి, 2019 పుల్వామా బాంబుదాడి వంటి ఘటనల్లో అతడి పాత్ర ఉందని భారత్ పేర్కొంది.
మసూద్ అజర్‌పై అంతర్జాతీయ స్థాయిలో చర్యలు తీసుకోవాలని భారత్ చాలాకాలంగా డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
