పైనంపురం ఎంపీటీసీ అభ్యర్థిగా దాసరి కుమారమ్మ నామినేషన్‌

టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ పత్రాలు సమర్పణ

ముత్తుకూరు, ఆంధ్రప్రభ : పైనంపురం ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దాసరి కుమారమ్మ శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఓ. రమేష్‌బాబుకు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సహకారంతో ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు దాసరి కుమారమ్మ తెలిపారు.