ప్రధాన కార్యదర్శిగా పి సతీష్ రెడ్డి నియామకం..

ప్రధాన కార్యదర్శిగా పి సతీష్ రెడ్డి నియామకం..

కడెం ( నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కడెం మండలం కొండూకూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొద్దుటూరి సతీష్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. గురువారం టీ పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్ నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడమ బొజ్జు పటేల్ లు జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యుల జాబితా విడుదల చేశారు.

జిల్లా ప్రధాన కార్యదర్శిగా పి సతీష్ రెడ్డిని నియమించారు. తన నియామకానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమా బొజ్జు పటేల్ లకు సతీష్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులను సమన్వయపరచుకుంటూ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వ చేపడుతున్న పథకాలను, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి పార్టీ పరంగా తీసుకువెళ్లడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరింత విజయం సాధించేలా కార్యకర్తలను సమన్వయమ పరుచుకుంటూ పని చేస్తానని ఆయన వివరించారు.

Leave a Reply