• విజ‌య‌వాడ ఉత్స‌వ్‌కు తొల‌గిన అడ్డంకులు…
  • ఉత్సవ్ పై ఆరోపణలు.. విమర్శలు…
  • అడ్డుకునేందుకు..కోర్టు మెట్లు ఎక్కిన వైసీపీ…
  • గొల్ల‌పూడిలో స్థ‌ల వివాదంపై హైకోర్టు స్టే…
  • ప్ర‌భుత్వంపై బుర‌ద జ‌ల్లేందుకు ప్ర‌తిప‌క్షాల కుట్ర‌…
  • విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్ని అకుంఠిత దీక్ష‌తో ఉత్స‌వ్‌కు విస్తృత ఏర్పాట్లు…
  • క‌నీవినీఎర‌గ‌ని రీతిలో నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక‌లు…
  • విజయవాడ ఖ్యాతిని ఇనుమ‌డింప‌జేసేలా కార్య‌క్ర‌మాలు…
  • మైసూరు ఉత్స‌వాల‌కు ధీటుగా నిర్వ‌హ‌ణ‌కు చ‌ర్య‌లు…
  • ఆధ్యాత్మిక సంబ‌రాలు.. సాంస్కృతిక మ‌హోత్స‌వాలు…


ఆంధ్రప్రభ, విజయవాడ : రాష్ట్రంలో ప్ర‌ప్ర‌థ‌మంగా విజ‌య‌వాడ ఉత్స‌వ్ (Vijayawada Utsav) పేరుతో భారీ కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌భుత్వం సహకారంతో విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ ఏర్పాట్లు చేశారు. దుర్గ‌మ్మ ద‌స‌రా ఉత్స‌వాల‌తో పాటు విజయవాడ ఉత్సవ్ మైసూరు త‌ర‌హాలో నిర్వ‌హ‌ణ‌కు సిద్ధ‌మైంది. ఆధ్యాత్మిక‌, సాంస్కృతిక‌, కార్య‌క్ర‌మాల‌తోపాటు వినోదాల‌ను పంచేందుకు ఏర్పాట్లు చేసింది. మూడు వేదిక‌ల్లో వంద‌లాది కార్య‌క్ర‌మాల‌తో న‌గ‌ర‌వాసుల‌ను అల‌రించేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించింది. గొల్ల‌పూడి ఎగ్జిబిష‌న్ నిర్వ‌హ‌ణ‌పై కొంత‌మంది కోర్టుకు వెళ్ల‌డంతో అనుమ‌తి నిరాక‌రించింది. అయితే నిర్వాహ‌కులు మ‌ళ్లీ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించడంతో ఆ ఉత్త‌ర్వుల‌పై స్టే ఇవ్వ‌డంతో నిరాటంకంగా ఉత్స‌వ్ నిర్వ‌హ‌ణ‌కు మార్గం సుగ‌మం అయింది. న‌గ‌ర శోభ మ‌రింత ద్విగుణీకృత‌మ‌య్యే రీతిలో ఉత్స‌వ్ నిర్వ‌హ‌ణ‌కు ఎంపీ కేశినేని చిన్ని (MP Keshineni Chinni) నిరంత‌ర ప‌ర్య‌వేక్షణ‌లో ఏర్పాట్లు శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాంప్రదాయ పరిమళాలు వెదజల్లేలా, వినోదం పంచేలా, పర్యాటక రంగం ఆకర్షించేలా విజయవాడ ఉత్సవ్ నిర్వహణకు సర్వం సిద్ధమయింది.

విజయవాడ ఉత్సవ్ నిర్వహణలో భాగంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసేందుకు వైబ్రేట్ విజయవాడ సొసైటీ (Vibrate Vijayawada Society) గొల్లపూడి సమీపంలోని దేవాదాయ శాఖకు చెందిన భూమిని లీజు ప్రాతిపదికన తీసుకుంది. మచిలీపట్నం గొడుగుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కి చెందిన 34.99 ఎకరాల భూమిని ఉత్సవ కోసం జిల్లా కలెక్టర్ లక్ష్మీ శ అనుమతుల కోరుతూ దేవాదాయ శాఖ కమిషనర్ కు లేఖ రాశారు. అయితే ఈ భూమిని వాణిజ్య అవసరాలకు కేటాయిస్తున్నారంటూ మచిలీపట్నానికి చెందిన బోర గడ్డ సుజయ్ మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ వేశారు.

కేసు పూర్వపరాలు విచారించిన న్యాయస్థానం స్టే ఇస్తూ, వాణిజ్య అవసరాలకు వినియోగించడానికి వీల్లేదు అంటూ తేల్చి చెప్పింది. శాశ్వత ప్రాతిపదికన లీజుకు తీసుకుంటున్నారంటూ వాదనలు వినిపించింది కూడా. ఇదే అంశంపై వైసీపీ నేతలు (YCP leaders) సైతం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తి భూకబ్జాలకు కూటమి నేతల పాల్పడుతున్నారంటూ విమర్శలు ఆరోపణలు చేశారు. విజయవాడ ఉత్సవ్ తప్పకుండా అడ్డుకుంటామంటూ సవాళ్లు విసిరారు. మళ్లీ కోర్టును ఆశ్రయించిన సొసైటీ ఫర్ వైబ్రేట్ విజయవాడ తమ వాదనలు వినిపిస్తూ కేవలం 56 రోజులకు మాత్రమే లీజుకు తీసుకున్నామని ఈ లెజకు సంబంధించి దేవస్థానం ఈవో పేరు మీద రూ 45 లక్షల చెక్కులు జారీ చేయడం జరిగిందనని కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన హైకోర్టు సీజే గతంలో సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇస్తూ, ఎగ్జిబిషన్ యధావిధిగా కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది..

విజయవాడ (Vijayawada) చారిత్రక వైభవాన్ని, సంస్కృతిని చాటి చెప్పేందుకు ఎంతో ప్రతిష్టాత్మంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ అడ్డుకునేందుకు వైసిపి నేతలు కుట్రలు పన్నుతున్నారంటూ కోటమీ పార్టీకి చెందిన నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోర్టులను సైతం పక్కదారి పట్టించేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. గడిచిన 12 సంవత్సరాలుగా విజయవాడ నగరంలో ఎగ్జిబిషన్ లేకపోవడం, నగర వాసులకు వినోదం ఆహ్లాదకర వాతావరణం లేని సందర్భంలో మైసూరు ఉత్సవ తరహాలో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ అడ్డుకోవడం అడ్డుకోవడం దారుణం అంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధిని చేసి చూపిస్తున్న సందర్భంలో పర్యాటక రంగాన్ని సైతం ప్రోత్సహించేలా ప్రభుత్వం చేపడుతున్న ఇటువంటి చర్యలు ప్రజల నుండి మంచి స్పందన వస్తున్నప్పటికీ రాజకీయంగా ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నట్లు ఉమ్మడి కృష్ణా జిల్లా(Joint Krishna District) కు చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు కార్పొరేషన్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

విజయవాడ ఉత్సవ్ (Vijayawada Utsav) సంబంధించి ముందుగా నిర్వహించిన ప్రి ఈవెంట్ అందరిని అబ్బురపరిచింది. ఉత్సవంలో నిర్వహించే అతి ముఖ్య కార్యక్రమాలకు సంబంధించిన ఏవి లాంచింగ్ తో పాటు, ఉత్సవ్ వెబ్సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్ లాంచ్, విజయవాడ ప్రీమియర్ లీగ్ ప్రోమో, లోగా ఆవిష్కరణ, విజయవాడ ఉత్సవ్ మార్కంటైజ్ విజయవాడ ఉత్సవ్ ఏఐ క్యారెక్టర్ లాంచ్, స్వచ్ఛ ధన్- మారథాన్, హెలికాప్టర్ రైడ్ (Helicopter ride) పొస్టర్ ఆవిష్కరణ ఎస్పో లాంచ్ వంటి కార్యక్రమాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఈ కార్యక్రమంలో సినీ తారలు అనుపమ దివి సంయుక్త మేనన్ మానస వర్షినితో పాటు, ప్రముఖ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ మరెందరో సినీ తారలు పాల్గొన్నారు. విజయవాడ సమీపంలోని మురళి రిసార్ట్స్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాద్, జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, కూటమీ నేతలు, నగర ప్రముఖులు వాణిజ్యవేత్తలతో పాటు సినీ రాజకీయ రంగాలకు చెందిన వారు, పెద్ద ఎత్తున ప్రేక్షకులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పాటు సొసైటీ ఫర్ వైబ్రేట్ విజయవాడ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాద్ నేతృత్వంలో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ విజయవంతం చేసేందుకు అందరినీ భాగస్వాములను చేసే క్రమంలో సన్నాహక, సన్నద్ధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవ సన్నాహ కమిటీ సమావేశం నగలనులోని ఒక ప్రముఖ హోటల్లో నిర్వహించగా ఈ సమావేశానికి ఇన్చార్జి మంత్రి సత్య కుమార్ యాదవ్ తో పాటు మంత్రులు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన శాసనసభ్యులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, పెద్ద ఎత్తున కూటమి నేతలు నగరానికి చెందిన ప్రముఖులు పాల్గొని విజయవాడ బ్రాండ్ పెంచేలా ఉత్సవంలో విజయవంతం చేద్దామని ఏకగ్రీవంగా తీర్మానించారు. వీటితోపాటు బార్ అసోసియేషన్, వర్తక, వాణిజ్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు వివిధ కళాశాలలో కూడా విజయవాడ ఉత్సవ్ విజయవంతం చేసేందుకు నిర్వాహకులు ఎక్కడికక్కడ అవగాహన సన్నాహక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

రాజకీయంగా, వాణిజ్యపరంగా, ఆధ్యాత్మికంగా.. పేరుపొందిన విజయవాడ బ్రాండ్ మరింత పెంచేలా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తామని, మైసూర్ ఉత్సవ తరహాలో నిర్వహించే ఈ కార్యక్రమంతో విజయవాడ పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందనుందని, అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులతో పాటు అమరావతి విజయవాడ సందర్శించే వారందరికీ వినోదాన్ని, సాంస్కృతిక సౌర బాలు పంచే విధంగా ఏర్పాటు చేస్తున్నామని, వైసీపీ కుట్రలు, కుతంత్రాలు చేదించి, అమ్మవారి దయ అందరి సహకారంతో ఈ ఉత్సవ్ విజయవంతం అవుతుందని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ తెలిపారు.

Leave a Reply