అనాథ వృద్ధురాలికి గ్రామస్తుల అంతిమ వీడ్కోలు
అంత్యక్రియలకు సర్పంచ్ చేయూత..
గ్రామస్తుల మానవతా చాటింపు
భూత్పూర్, ఆంధ్రప్రభ : కొత్త మొల్గర గ్రామానికి చెందిన కటికే రాధాబాయి అనాథగా మృతి చెందడంతో గ్రామ సర్పంచ్ వెంకటేష్, వార్డు సభ్యులు, గ్రామస్తులు మానవతా దృక్పథంతో ముందుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఆపదలో అండగా నిలిచే గ్రామస్తులే బంధువులుగా మారి ఆమెకు చివరి వీడ్కోలు పలికారు. అంత్యక్రియలకు సంబంధించిన పూర్తి ఖర్చును సర్పంచ్ వెంకటేష్ భరించారు. ఎవరూ లేని వృద్ధురాలికి గ్రామస్తులంతా ఒక్కటై అంత్యక్రియలు నిర్వహించడం పట్ల పలువురు అభినందించారు. మానవత్వం, సామాజిక బాధ్యతకు ఈ ఘటన నిదర్శనమని పేర్కొన్నారు.
