ఆపరేషన్ సేఫ్ క్యాంపస్…

ఈగల్ సెల్ అధికారులు సంయుక్తంగా విద్యాసంస్థల వద్ద తనిఖీలు
నిషేధిత వస్తువులు విక్రయిస్తున్న 4 దుకాణాల యజమానులకు జరిమానాలు


అనంతపురం ప్రతినిధి, సెప్టెంబర్ 3(ఆంధ్రప్రభ) : విద్యాసంస్థల పరిసరాల్లో అక్రమ వ్యాపారాలు, అసాంఘీక కార్యకలాపాల అడ్డుకట్టే లక్ష్యంగా జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు అనంతపురం మూడో పట్టణ పోలీసులు, ఈగల్ సెల్ అధికారులు ఈరోజు ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’ పేరుతో విస్తృత తనిఖీలు చేపట్టారు.

​నగరంలోని 4వ రోడ్డు ప్రాంతంలో ఉన్న నేతాజీ హైస్కూల్, పీఆర్కే జూనియర్ కాలేజీ, సన్‌షైన్ హైస్కూల్ తదితర విద్యాసంస్థల చుట్టూ 500 మీటర్ల పరిధిలోని 6 కిరాణా దుకాణాలను పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని నిషేధిత వస్తువులు విక్రయిస్తున్న 4 దుకాణాల యజమానులకు జరిమానా విధించారు.

​విద్యాసంస్థల పరిసరాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో అనంతపురం మూడో పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది, జిల్లా ‘ఈగల్ సెల్’ ఎస్సై హనుమంతు ఆధ్వర్యంలో బృందం పాల్గొన్నారు.