Opening | మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా..

Opening | మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా..
- ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం
- ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
- మాపాక్షిలో అర్బన్ పీహెచ్‌సీ భవనం ప్రారంభం
Opening | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. చిత్తూరు నగరపాలక పరిధిలో 13వ వార్డు మాపాక్షి గ్రామంలో నూతనంగా నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ప్రజల మౌలిక సదుపాయాలను, అవసరాలను తీర్చేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. ఇక్కడ నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. త్వరలో మరో రెండు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాలను ప్రారంభిస్తామన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో 14 విలేజ్ హెల్త్ క్లినిక్లు, మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాల ఆధునికరణ, నిర్మాణానికి రూ.3.84 కోట్ల నిధులు మంజూరు అయినట్లు తెలిపారు.

అనంతరం మాపాక్షి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద, చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, కమిషనర్ పి నరసింహ ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.సుధారాణి, ఎంహెచ్వో డా.లోకేష్, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, కార్పొరేటర్ బాబు, కూటమి నాయకులు చంద్ర ప్రకాష్, అట్లూరి శ్రీనివాసులు, వెంకటేష్ యాదవ్, ఈశ్వర్, నరేష్, జి.సురేష్, పార్టీ నాయకులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

