utkur snake| ఇనుప కంచెపై తచ్చాడిన పాము
utkur ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ పోలీస్ స్టేషన్(utkur Police Station) ఇనుప కంచెపై పాము తచ్చాడుతున్న దృశ్యం కనిపించింది. పోలీస్ స్టేషన్ చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేసినా పాము కంచెపై పడగవిప్పి ఉండడంతో పోలీసులు, స్టేషన్ కి వచ్చిన పలువురు భయాందోళన(Panic) చెందారు.
అనంతరం స్టేషన్ కి వచ్చిన కొంత మంది యువకులు రాళ్లు విసరడంతో పాము ముళ్ళ పొదల్లోకి వెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీస్ స్టేషన్( Police Station) గ్రామ చివరలో ఉండడంతో తరచూ పాములు సంచరిస్తున్నాయని పోలీస్ సిబ్బంది భయాందోళన చెందుతున్నారు.

