Ongole-Cbi-Arrest : మైన్స్ సేఫ్టీ ఆఫీసర్ అరెస్ట్ Andhra Prabha Crime News
Ongole-Cbi-Arrest : మైన్స్ సేఫ్టీ ఆఫీసర్ అరెస్ట్ Andhra Prabha Crime News
- ఒంగోలులోCBI కలకలం
- 2 లక్షల లంచం ఆరోపణలు
- హోటల్లో మైన్స్ సేఫ్టీ ఆఫీసర్..
- తెల్లవారుజామున CBI అరెస్ట్
(ఒంగోలుసిటీ, ఆంధ్రప్రభ)
Ongole-Cbi-Arrest డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ శివశంకర్ ను సిబిఐ అధికారులు ఒంగోలులోని ఒక హోటల్లో మంగళవారం వేకువజామున అరెస్ట్ చేశారు. భూగర్భ గనుల్లో ప్రమాదాల నిరోధానికి నియమించబడిన అధికారిగా పనిచేస్తున్న శివశంకర్ ప్రకాశం జిల్లా బల్లికురవ గ్రానైట్ గనుల్లో సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఆయన షెడ్యూల్ ప్రకారం మంగళవారం చీమకుర్తి కార్యాలయంలో తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. అయితే సోమవారం తనిఖీల అనంతరం గ్రానైట్ యజమానుల నుండి లంచం ఆశించినట్లు, వారు మంగళవారం 2 లక్షల రూపాయలు శివశంకర్ కు అందించేందుకు హోటల్ కి వచ్చినట్లు సమాచారం. నిఘా పెట్టిన సిబిఐ అధికారులు శివశంకరును,లంచం ఇవ్వచూపిన గ్రానైట్ క్వారీ యజమానులు సురేష్ భాస్కర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ విచారణ నిమిత్తం విజయవాడ తరలించినట్లు సమాచారం.
