రక్తదానం చేసిన ఓఎన్‌జీసీ యూనిట్ సీఐఎస్‌ఎఫ్ జవాన్లు
నరసాపురం, ఆంధ్రప్రభ: సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా నరసాపురం ఓఎన్‌జీసీ యూనిట్‌కు చెందిన సీఐఎస్‌ఎఫ్ జవాన్లు రక్తదానం చేశారు. నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ స్టోరేజ్ యూనిట్, తణుకు ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 11 మంది సీఐఎస్‌ఎఫ్ జవాన్లు పాల్గొన్నారు. వీరిలో ఇద్దరు మహిళా జవాన్లు ఉన్నారు.
ఈ సందర్భంగా నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రి డ్యూటీ డాక్టర్ కాంతిప్రియ మాట్లాడుతూ రక్తదానం గొప్ప సామాజిక సేవ అని అన్నారు. ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, అత్యవసర వైద్య పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సకాలంలో అందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని సూచించారు.
రక్తదానం చేసే వ్యక్తి కనీసం 50 కిలోల బరువు కలిగి ఉండాలని, హిమోగ్లోబిన్ స్థాయి కనీసం 12.5 గ్రాములు/డెసీలీటర్ ఉండాలని తెలిపారు. ఒకసారి రక్తదానం చేసిన అనంతరం తదుపరి రక్తదానానికి కనీసం మూడు నెలల విరామం ఉండాలని వివరించారు.
ఓఎన్‌జీసీ టెంపుల్ యూనిట్ సీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శైలేంద్రకుమార్ సతపతి మాట్లాడుతూ ప్రధాని సేవా సంకల్ప్ అభియాన్ మెడికల్ క్యాంపులో భాగంగా 11 మంది జవాన్లు రక్తదానం చేశారని తెలిపారు. ప్రతి ఏడాది ఒకసారి రక్తదాన కార్యక్రమం నిర్వహించాలని తమ యూనిట్ నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో తణుకు ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి. రేవతి, సీఐఎస్‌ఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ బినోద్‌కుమార్, ఇంటెలిజెన్స్ అధికారి కామేశ్వరరావు చిప్పాడ, స్టాఫ్ నర్స్ వి. కమలాకుమారి, ఎల్‌టీఆర్ వికాస్, జనరల్ ఎల్‌టీ కె. రవి, ఐసీటీసీ హెల్త్ కౌన్సెలర్ సైకాలజిస్ట్ జేసు ప్రసాద్‌బాబు, ఎస్‌ఎస్‌కే మేనేజర్ అనంతలక్ష్మి, ఎస్‌ఎస్‌కే ఓఆర్‌డబ్ల్యూ శరణ్య, సుసన్నతో పాటు ఓఎన్‌జీసీ టెంపుల్ యూనిట్ సీఐఎస్‌ఎఫ్ జవాన్లు పాల్గొన్నారు.
