ONGC gas leak | ఇరుసుమండలో ONGC గ్యాస్ లీక్
గ్రామాన్ని ఖాళీ చేస్తున్న అధికారులు
ONGC gas leak | తూర్పు గోదావరి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లా మల్కిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్‌జీసీ (ONGC) పైప్‌లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అయిన సంఘటన కలకలం రేపింది. గ్రామంలోని పొలాల సమీపంలో ఉన్న పైప్‌లైన్ నుంచి గ్యాస్ భారీగా ఎగజిమ్ముతూ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఓఎన్‌జీసీ అధికారులకు సమాచారం అందించిన స్థానికులు, గ్యాస్ గ్రామంలోకి వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ముందు జాగ్రత్త చర్యగా స్థానిక నాయకులు, అధికారులు గ్రామాన్ని ఖాళీ చేసే పనులు చేపట్టారు. గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఓఎన్‌జీసీ బృందాలు (ONGC teams) ఘటనాస్థలానికి చేరుకుని లీకేజీని అదుపు చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై పోలీసులు, రెవెన్యూ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.


