భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన సెమీఫైనల్‌లో… ఆస్ట్రేలియాపై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్ చరిత్ర సృష్టించింది. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో భారత శతక్కొట్టిన జెమీమా.. ప్రత్యేక రికార్డు తన పేరుపై నమోదు చేసుకుంది.
ఆస్ట్రేలియా మహిళల జట్టుపై విజయవంతమైన పరుగుల చేధనల్లో (ఓడీఐల్లో) అత్యధిక వ్యక్తిగత స్కోర్లు సాధించిన వారి జాబితాలో జెమీమా అగ్రస్థానంలో నిలిచింది. నేటి మ్యాచ్ ముంబై (డి.వై. పాటిల్) సెమీఫైనల్‌లో జెమీమా 134 బంతుల్లో 14 ఫోర్లతో 127 నాటౌట్ పరుగులు చేసి ఈ ఘనత సాధించింది.
రెండో స్థానంలో న్యూజిలాండ్ బ్యాటర్ సుజీ బేట్స్ ఉంది. 2012లో సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో ఆమె 122 పరుగులు చేసి న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇక ఇంగ్లాండ్‌కు చెందిన క్లెయిర్ టేలర్ 2005లో టాంటన్‌లో ఆస్ట్రేలియాపై 116 పరుగులు చేసి మూడో స్థానాన్ని దక్కించుకుంది.

