ఫ్యాక్షన్‌ను వీడి ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టాలి

  • యువత భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలి..
  • గొడవలతో కుటుంబాలు రోడ్డున పడతాయి
  • రెంటాలలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ లావు, ఎమ్మెల్యే జూలకంటి

రెంటచింతల, ఆంధ్రప్రభ: ఫ్యాక్షన్ రాజకీయాలను వీడి యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచించారు. రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు నూతన విగ్రహాన్ని వారు మంగళవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఎంపీ లావు, ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ.. గొడవలు, ఘర్షణల వల్ల కుటుంబాలు నష్టపోతాయని, యువత మంచి భవిష్యత్‌ కోసం ఆలోచించాలని సూచించారు. ఫ్యాక్షన్‌ సంస్కృతికి దూరంగా ఉంటూ విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల సాధనపై యువత దృష్టి పెట్టాలని కోరారు.మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడంతో పాటు వారి ఆశయాలు, సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకోవాలని నేతలు సూచించారు. సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చపారపు అబ్బిరెడ్డి, గొంటు సుమంత్‌రెడ్డి, మున్నా ప్రభురాజు, మందలపు హనుమిరెడ్డి, రామకృష్ణ, పేరం సీతమ్మ, పేరం సర్వారెడ్డి, శేర్రెడ్డి ప్రదీప్‌రెడ్డి, గొంటు మల్లేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.