Medak | యువకుడు మృతి…

Medak | యువకుడు మృతి…

Medak | మెదక్, ఆంధ్రప్రభ: మెదక్ పట్టణ పరిధిలోని సీడబ్ల్యూసీ గోదాం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో మెదక్ పట్టణానికి చెందిన సద్దాం (40) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నిత్యావసర వస్తువులు తీసుకురావడానికి వెళ్లిన సద్దాం తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న మెదక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.