ఒకరికి గాయాలు
కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : నిజామాబాద్(Nizamabad) జిల్లా కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని రైస్ మిల్ సమీపంలో ఈ రోజు కారును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. మెట్ పల్లి మండలం రాజేశ్వరరావు పేట్‌కు చెందిన దుంపల సాయి(Dumbala Sai) (28) ఎయిర్ పోర్ట్ నుండి స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా కరీంనగర్( Karimnagar) డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ నుండి నిజామాబాద్ కు వెళ్తుండగా కారును ఢీ కొట్టింది.
కారును బస్సు(Bus) ఢీకొట్టడంతో కారు నడుపుతున్నదుంపల సాయికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం మేరకు 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని దుంపల సాయికి ప్రథమ చికిత్స(first aid) నిర్వహించి ఆస్పత్రికి తరలించారు.


