on8countries| ఇరాన్‌పై దాడులను సమర్థించుకున్న నెతన్యాహు

on8countries| ఇరాన్‌పై దాడులను సమర్థించుకున్న నెతన్యాహు

on8countries | క్షిపణి స్థావరాలు, రెవల్యూషనరీ గార్డు లక్ష్యంగా దాడులు
అణ్వాయుధ ముప్పు అడ్డుకోవడమే లక్ష్యం – ఇజ్రాయెల్ ప్రధాని
యుద్ధ సమయంలో పౌరులు సైన్యానికి సహకరించాలి
ఇరాన్ మిస్సైల్ దాడులతో ఉద్రిక్తతలు తీవ్రం
అణ్వాయుధాలు ఉగ్రవాద దేశం చేతిలో ప్రమాదకరం – ట్రంప్
అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త చర్యలపై అంతర్జాతీయ చర్చ

on8countries
on8countries

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఇరాన్ పై దాడులను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సమర్థించుకున్నారు. ఇరాన్ తో ఇజ్రాయెల్ మనుగడ ప్రమాదంలో పడే అవకాశం ఉందని అందుకే దాడులు చేస్తున్నామని వెల్లడించారు.ఆ భయాలను తొలగించేందుకు అమెరికాతో కలిసి ఆపరేషన్ చేపట్టామని నెతన్యాహూ అన్నారు. ఇరాన్‌లో ఉన్న క్షిపణి స్థావరాలను, పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డు, బాసిజ్ దళానికి చెందిన వాలంటీర్ల పైనా దాడులు చేస్తున్నట్లు తెలిపారు.

దాదాపు ఐదు దశాబ్దాలుగా ఇజ్రాయెల్, అమెరికాకు ఇరాన్ పాలన ముప్పుగా పరిణమించిందని అన్నారు. ఈ యుద్ద సమయంలో సైన్యం ఆదేశాలను ఇజ్రాయెల్ పౌరులు పాటించాలని సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్ మున్ముందు కొనసాగే అవకాశం ఉందని, కలిసికట్టుగా ధైర్యంగా పోరాడాల్సి ఉందని అన్నారు. అలాగే ఇరాన్‌లోని అన్ని వర్గాల ప్రజలకు నిరంకుశ పాలన నుంచి విముక్తి, స్వేచ్ఛ, శాంతిని పొందే సమయం వచ్చిందన్నారు.

నియంత ఇరాన్ పాలన ఎంతోమంది అమెరికన్లను బలి తీసుకుందని, తమ దేశ పౌరులను ఊచకోత కోసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్ తన అణ్వాయుధాలతో మానవాళిని బెదిరించే అవకాశం ఇవ్వకూడదని నెతన్యాహూ అన్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య తీవ్ర స్థాయికి చేరింది. ఇజ్రాయెల్ ఇరాన్ లోని మినాబ్ ప్రాంతంలోని ఓ స్కూల్ పై వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో 36 మంది విద్యార్థులు మృతి చెందారు.

మరోవైపు ఒకేసారి 8 దేశాలపై మిస్సైళ్లు ఇరాన్‌ ప్రయోగించింది. ఇజ్రాయెల్‌, బహ్రెయిన్‌, కువైట్‌, సౌదీతో పాటు..అబుదాబి, ఖతార్‌, జోర్డాన్‌, యూఏఈపై ఇరాన్‌ దాడులు చేస్తొంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షులు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద పాలనలో ఉన్న దేశం దగ్గర అణ్వాయుధాలు ఉండడం ప్రమాదకరమని.. అందువల్లే వాటిని నాశనం చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. ప్రపంచంలో ఉగ్రవాదానికి ఇరాన్‌ అతిపెద్ద మద్దతుదారని ట్రంప్ అన్నారు.

ఇటీవల నిరసనలు చేపట్టిన తన సొంత పౌరులనే వీధుల్లో దారుణంగా చంపేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌ పాలకుల ముప్పు నుంచి అమెరికాను రక్షించుకోవడమే తమ లక్ష్యమన్నారు. అందుకే ఇజ్రాయెల్ తో కలిసి దాడులు చేస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు

Leave a Reply