తొండూరు, జులై 19 (ఆంధ్రప్రభ): కడప జిల్లా (Kadapa District) తొండూరు మండలంలోని ఇనగలూరు గ్రామానికి చెందిన దస్తగిరి (Dastagiri), సమరసింహారెడ్డి (Samarasimha Reddy)ల మధ్య గత కొంతకాలంగా ఉన్న పాత కక్షలు శనివారం ఉద్రిక్తతకు దారితీశాయి. మండల పరిధిలోని సైదాపురం (Saidapuram) గ్రామం వద్ద దస్తగిరి తన ప్రత్యర్థులైన సమరసింహారెడ్డి, హరికిశోరరెడ్డి పై కారుతో ఢీకొట్టాడు. అనంతరం రాడ్లతో, కట్టెలతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు.
ఈ సంఘటనలో సమరసింహారెడ్డి, హరికిశోరరెడ్డిలకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వారిని వెంటనే పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని గమనించిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామస్థులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తక్షణ చర్యపై ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.