జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. ఎక్కడంటే !!

మెండోరా (ఆంధ్రప్రభ): నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆదివారం ఇథనాల్ ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్యాంకర్ అదుపు తప్పి రోడ్డుపై అడ్డంగా పడిపోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ఎలాంటి ప్రమాదం జరగకుండా వాహనాలను దారి మళ్లించారు. ట్యాంకర్ రోడ్డుపై బోల్తాపడటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటన స్థలం నుంచి బాల్కొండ వరకు వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పెద్ద ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

